Saturday, October 18, 2014

30 -- సమస్యా పూరణం – 1534 (గంగను మున్గి పాపముల)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన పూరన ఇది...
గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!
ఈ సమస్యను పంపిన సంపత్ కుమార్ శాస్త్రి గారికి ధన్యవాదాలు.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
శ్రీపతిశాస్త్రి చెప్పారు...
శ్రీగురుభ్యోనమః

బంగరు భూమి భారతము పావనితీర్థము పారుచుండగా
మంగళమాయె జీవులకు మానవ జాతులు స్వార్థచిత్తులై
దొంగలవోలె సంపదలు దోచిరి, దుష్ట దురూహబుద్ధిదుర్
గంగను మున్గి పాపములఁ గట్టుక వచ్చితి మయ్యొ దైవమా!

దుష్ట దురూహబుద్ధిదుర్గంగ = దుష్టమైన చెడ్డ ఊహలు కలిగిన బుద్ధి యనెడు కలుషిత నీరు.

4 comments:

 1. నచ్చిన పద్యాలని ఇలా ఎత్తి ఇలా ప్రత్యేకంగా ప్రకటించడం కూడా సాహిత్యసేవే. ధన్యవాదాలు.

  ReplyDelete
 2. ఎన్నిఆటంకాలు వచ్చినా దాటుకుంటూ శంకరాభరణం ద్వారా ఎంతమంది చేతో సాహిత్యసేవ చేయిస్తూ విశ్రాంత జీవితం గడుపుతున్న మీకు ఎన్ని ప్రణామములు ఇవ్వాలో చెప్పలేము.
  ఇక నేనంటారా వరసాగ్గా చదువుకోటానికి మంచి పద్యాలు ఉంటాయని నాకు నచ్చిన పద్య కుసుమాలని ఒక పుష్పక మాలలో కూరుస్తున్నాను.
  మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete
 3. ఇరువురి సాహిత్యసేవలూ కూడా చాలా ప్రశంశనీయమైనవే అంటాను.

  ఏదో నాకూ కొంచెం అలాంటి తాపత్రయం ఉంది కాని అందుకు తగినంత శక్తి నాకు ఉన్నట్లుగా కనిపించటం లేదు. అదే నా విచారం. ఐనా ఏదో క్రిందుమీదులౌతున్నాననుకోండి అప్పుడప్పుడూ.

  ReplyDelete
 4. శ్యామలీయం గారూ నాకు తెలిసింది చాలా తక్కువ. "మాలిక" రోజూ చూసే వాళ్ళందరికీ వివిధ విషయాలలో మీ శక్తి సామర్ధ్యాలు తెలుసు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

  ReplyDelete