Friday, May 30, 2014

005 - పద్య రచన – 574 (బొమ్మల కొలువు)

పద్య రచన – 574

కవిమిత్రులారా,

పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం

అయ్యవారలు ఇచ్చిరి ఆశీర్వచనములు
బొమ్మల పెండ్లికి బ్లాగు లోకమున ;
రండి రారండి, మీరూ ఆశీర్వదించి
జిలేబి గైకొనండి వేడి వేడి చాయ తోడన్ !!

జిలేబి గారు మీ కవితకు నా పద్యరూపం

ఇమ్ముగ నయ్యవారలట హృద్యముగాను పఠింప మంత్రముల్
బొమ్మల పెండ్లి జూచుచు ప్రమోదము నొందగ బ్లాగు వీక్షకుల్
రమ్ము జిలేబి తీపి రుచి క్రమ్మున గొందము భోజనమ్ములో
కమ్మని చాయి నందెదము కన్నుల నిండుగ పెండ్లి గాంచుచున్!

Thursday, May 29, 2014

004 - సమస్యాపూరణం – 1426 (లంచము నీయఁగోరె హరి)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
లంచము నీయఁగోరె హరి లక్ష్మినిఁ బొందగఁ గోరి లుబ్ధుఁడై.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
ఒకానొక అవధానంలో గరికిపాటి వారికి ఇచ్చిన సమస్య ఇది...

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం


ముంచెను దేశ గౌరవము ముంచెను మానవ జాతి విల్వలున్
ముంచెను నీతి ధర్మములు ముమ్ముర మాస్థిని కూడబెట్టగన్
గొంచము గూడ సిగ్గు పడకుండను బొందుచు నిచ్చుచున్ సదా
లంచము నీయ గోరె 'హరి' లక్ష్మిని బొందగ గోరి లుబ్డుడై. 

Tuesday, May 27, 2014

003 - పద్య రచన – 259 (తెలుఁగు పద్యము చచ్చినదని కొందఱిమాట - నిజమా?)

కవిమిత్రులారా,
నేటి పద్యరచనకు అంశము...
"తెలుఁగు పద్యము చచ్చినదని కొందఱిమాట - నిజమా?"

Monday, May 26, 2014

002 - సమస్యాపూరణం – 1422 (కాకిని పెండ్లి యాడె)

కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)




కంది శంకరయ్య గారి "శంకరాభరణం" లో నాకు నచ్చిన పద్యాలు.







Laxminarayan Ganduri చెప్పారు...
లేకయు తల్లి దండ్రులును లేక ధరించగ గుడ్డమేని పై
లేక వసించ గూడు గతిలేకను దిండికి పొట్ట కూటికై
లోకపు పల్లె పట్టణములోనను నిత్యము తిర్గుచున్న యే
కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.
కంది శంకరయ్య చెప్పారు...
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తిండికి పొట్టకూటికై’ అన్నప్పుడు పునరుక్తి దోషం. ‘తిండికి పొట్టనింపగా’ అందామా?
*

Shankaraiah Boddu చెప్పారు...
ఆకలి దీర్చలేని తన యప్పయు నన్నలు పెండ్లి జేతురో
లేక వివాహ భారమని లెక్కలు జేయుచు తప్పుకుందురో
నాకిక పెండ్లి చేయగల నాథుడు లేడని పైకమున్న యే
కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో!


Monday, May 12, 2014

001. పద్య రచన – 594 ( అంశము... "కన్నె కలలు")

కంది శంకరయ్య గారి "శంకరాభరణం" లో నాకు నచ్చిన పద్యాలు. 

001. పద్య రచన – 594 (ఈనాటి పద్యరచనకు అంశము... "కన్నె కలలు")  


Annapareddy satyanarayana reddy చెప్పారు...

చక్కని రూపురేఖలును శాంతపు చిత్తము, లచ్చి పుత్రుడై
మిక్కిలి ప్రేమతోడ తన మిత్రుల బందుల నాదరించుచున్
చిక్కు సమస్యలందునను చిత్తము నెప్పుడు చిక్క నీక బల్
మక్కువ తోడ తన్నుగను మాన్యుని భర్తగ కోరునెప్పుడున్