Tuesday, July 29, 2014

21 - పద్యరచన - 634 (చిన్నారి)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
 గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:
Chandramouli Suryanarayana చెప్పారు...

హారము కంఠ సీమపై , హాయిగ నూగెడు బుట్టలున్ చెవిన్,
బారెడు కేశపాశములు పాపిడి బిళ్ళయు శోభకూర్చ సం
స్కారము మెండుగాఁ గలిగి చక్కని ముద్దుల పాప తా నమ
స్కారము చేయమోడ్చె తనగాజుల చిట్టి కరాలు మ్రోగగన్

Friday, July 25, 2014

20 - పద్యరచన - 629 (అమ్మ)

కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

Thursday, July 17, 2014

019 - పద్యరచన - 623 (గురువు గారు)

కవిమిత్రులారా,
నేడు నా పుట్టినరోజు.
అరవై నాలుగేళ్ళు నిండి అరవై ఐదులో పడ్డాను. 
ఇన్నేళ్ళ జీవితంలో సాధించిం దేమిటని వెనక్కు తిరిగి చూసుకుంటే
“శూన్యం!”
అందరూ ఉండికూడా ప్రేమాభిమానాలకు నోచుకోక ‘వృద్ధాశ్రమం’ దిక్కయింది.
మాస్టరుగారూ ! మీకు జన్మదిన శుభాకాంక్షలు.

మాకు సమస్యలనిచ్చి ఆనందింపజేయు మీకు సమస్యలనీయకుండా భగవంతుడు ఆనందీంపజేయాలని కోరుకొనుచున్నాను.


కోరుచు నీ సమస్యలను గొప్పగ నిచ్చుచు మీరు మాకు నే
మారక రోజు రోజు మరి చక్కటి మార్గము చూపుచుంటిరే !
కోరక నే సమస్యలను కుప్పలగిఛ్ఛుచు నున్న దేవుడే
మారుచు బాధ దీర్చు నొకమార్గము మీకిక జూపకుండునా !
గురువర్యులు కంది శంకరయ్య గారికి జన్మదిన హార్దిక శుభాకాంక్షలు:-

కలత వహించ వద్దు తమకండగ శిష్యుల ముండినాము మీ
తలపుల నేనిరాశ దరి దాపుల చేరగ నీయ వద్దు మీ
గలగల నవ్వులన్ మదిని గాయము లన్నియు మాని మీకికన్
కలుగు శుభమ్ము మిమ్ములను గావును జానకి రాము లెన్నడున్
వందనమ్మిదె గురుదేవ పండితార్య
చింత లన్నియు దీర్చునా సిరుల తల్లి
సకల సౌఖ్యము లిచ్చును శారదాంబ
ఖ్యాతి నందించు కవికుల జ్యోతి మీరు
జన్మదినశుభా కాంక్షలు శంకరార్య!

Sunday, July 13, 2014

018 - సమస్యా పూరణం – 1472 (పూవులో రెండు పూవులు)

కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య.....
పూవులో రెండు పూవులు పూచెఁ గనుఁడు.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు: 

sailaja చెప్పారు...
సిగ్గులొలుకుచు ప్రేయసి చెంత నిలువ
కమలిని ముఖారవిందాన కనులు జూచి
పరవశమ్మున చెలికాడు పలికె నిటుల
పూవులో రెండు పూవులు పూచె గనుడు
గుండా వేంకట సుబ్బ సహ దేవుడు చెప్పారు...
వసుధ వెలుగులఁ జిమ్ముచు వాసి కెక్కె
తెలుగు భాషా ప్రసూనమ్మ తేనెలమ్మ!
రెండు రాష్ట్రాలుగ విరిసె,లెస్స బలుక
పూవులో రెండు పూవులు పూచెఁ గనుడు!

Wednesday, July 2, 2014

017 - పద్యరచన - 607 (నాని)

కవిమిత్రులారా,
పైచిత్రంలో ఉన్న నా పౌత్రుని ఆశీర్వదిస్తూ పద్యము(లు) వ్రాయవలసిందిగా మనవి. 
ఇంకా పేరు పెట్టలేదు కాని ‘శివసాయి’ అని పిలుస్తున్నాం. నేనేమో ‘నానీ’ అని పిలుస్తాను. 
వాడికి దూరంగా వృద్ధాశ్రమంలో ఉన్నాననే నా బాధ.

మనుమఁడ! నిను వీడి యిచట
ఘనదుఃఖాత్ముఁడ నయి బ్రతుకఁగ వలసె నయో!
మనమున చెదరని నీ రూ
పును సతము స్మరించి ప్రొద్దు పుచ్చెద నానీ!

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు:

గుండా వేంకట సుబ్బ సహ దేవుడు చెప్పారు...
బూరెలఁ బోలిన బుగ్గలు,
మారాములఁ జేయు నవ్వు మరువగ లేనే!
రారా! ముద్దుల మనుమడ!
గారాముగఁ బ్రతి దినంబు కలలో నానీ!