Monday, May 26, 2014

002 - సమస్యాపూరణం – 1422 (కాకిని పెండ్లి యాడె)

కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.
ఈ సమస్యను పంపిన అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలు.
(ఇది ఒకానొక అవధానంలో గరికిపాటివారికి ఇచ్చిన సమస్య)




కంది శంకరయ్య గారి "శంకరాభరణం" లో నాకు నచ్చిన పద్యాలు.







Laxminarayan Ganduri చెప్పారు...
లేకయు తల్లి దండ్రులును లేక ధరించగ గుడ్డమేని పై
లేక వసించ గూడు గతిలేకను దిండికి పొట్ట కూటికై
లోకపు పల్లె పట్టణములోనను నిత్యము తిర్గుచున్న యే
కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో.
కంది శంకరయ్య చెప్పారు...
గండూరి లక్ష్మినారాయణ గారూ,
మీ పూరణ బాగుంది. అభినందనలు.
‘తిండికి పొట్టకూటికై’ అన్నప్పుడు పునరుక్తి దోషం. ‘తిండికి పొట్టనింపగా’ అందామా?
*

Shankaraiah Boddu చెప్పారు...
ఆకలి దీర్చలేని తన యప్పయు నన్నలు పెండ్లి జేతురో
లేక వివాహ భారమని లెక్కలు జేయుచు తప్పుకుందురో
నాకిక పెండ్లి చేయగల నాథుడు లేడని పైకమున్న యే
కాకిని పెండ్లి యాడె నొక కన్నె విలాసిని కాకినాడలో!


9 comments:

  1. లక్కరాజు వారూ,
    ఒక ప్రత్యేకమైన బ్లాగులో నచ్చిన అంశాలతో బ్లాగు నడపడం నేను ఇదే మొదటిసారి చూడడం. మీరు ఎప్పుడు పద్యాలు వ్రాయక పోయినా, శంకరాభరణం బ్లాగును నిరంతరం వీక్షిస్తూ, నచ్చిన అంశాన్ని ఎప్పటికప్పుడు తెలియజేస్తూ క్రొత్తగా పద్యాలు వ్రాయడం అభ్యాసం చేస్తున్న ఔత్సాహిక కవిమిత్రులకు ప్రోత్సాహాన్ని ఇస్తూ పద్యకవిత్వం పట్ల మీకున్న అభిరుచిని తెలియజేస్తున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete
    Replies
    1. శంకరయ్య గారూ
      "శంకరాభరణం" లో అందాలు చూపటానికి ఈ బ్లాగ్ నడుపుదామని ఆశిస్తున్నాను. "శంకరాభరణం" లో మీరు చూపించే దీక్షకీ మీ శక్తికీ వందనాలు. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  2. లక్కరాజు రావుగారు,
    రాజలక్షణం చూపించినారు. మీకు శుభాకాంక్షలు. వందనాలు./\

    ReplyDelete
    Replies
    1. ఎదోలెండి మీ లాంటి వాళ్ళు కష్టపడి పద్య పూరణలు చేస్తూ ఉంటే మాలాంటి వాళ్ళం చదివి ఆనందిస్తూ ఉంటాము. ఒక్కొక్కప్పుడు గిల్టీ గా అనిపిస్తుంది కానీ వదలలేము. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

      Delete
  3. గిల్టీ ఎందుకండి? పద్యాలన్నిట్లో ఈ పద్యం నాకు నచ్చింది అని చెప్పేవారుండడం ఎంతో ప్రోత్సాహకరమైనది వ్రాసేవారికి. క్రికెట్ చూసేవాళ్ళుంటే ఆడేవాళ్ళకు ఉత్సాహం కదా , ఇదీ అంతే. :)

    ReplyDelete
    Replies
    1. వావ్. భలే పోలిక. థాంక్స్.

      Delete
  4. Rao S Lakkaraju గారూ, మీ బ్లాగులో చోటు దక్కినందులకు సంతోషిస్తున్నాను.

    ReplyDelete
  5. This comment has been removed by a blog administrator.

    ReplyDelete
  6. Shankaraiah Boddu గారూ కమ్మటి పద్యాలు వ్రాసినందుకు మిమ్మల్నే చాలా చాలా అభినందించాలి. మీ వ్యాఖ్యకు ధన్యవాదములు.

    ReplyDelete