Saturday, November 8, 2014

35 -- పద్యరచన - 729 (చిన్నారి విన్నీ)
కవిమిత్రులారా పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/08/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :

Timmaji Rao Kembai చెప్పారు...
పూజ్యులు గురుదేవులు శంకరయ్య గారికి వందనములు
పద్య రచన విరిబాల

బాలిక సోయగమ్ముగన బంతి సుమమ్ములు పూచె నావనిన్
మేలిమి నున్నబుగ్గలను మెల్లగతాకెను తన్మయమ్మునన్
మీలిత కన్నులన్ చిరుత మించు సువాసన లాశ్వసించగా
మాలిమిజేసె నీ ప్రకృతి మాత యొసంగుచు దీవెనల్ సదా
నవంబర్ 08, 2014 12:36 PM

3 comments:

 1. లక్కరాజు వారూ,
  ధన్యవాదాలు.

  ReplyDelete
 2. కంది శంకరయ్య గారూ మీ వ్యాఖ్యకు ధన్యవాదములు. శ్యామలీయం గారూ పద్యం మీద మీ అభిప్రాయాన్ని శంకరాభరణం పోస్ట్ లో పెట్టాను. ఎవ్వరూ స్పందించలేదు. మీ వ్యాఖ్య స్పాం అనుకుని డిలీట్ చేస్తున్నాను. పద్యం మీద మీ అభిప్రాయాలని ఇక్కడ కన్నఒరిజినల్ పోస్ట్ లో పెడితేనే బాగుంటుంది.

  ReplyDelete
 3. అయ్యా శ్యామలీయం గారూ దీనిలో పోస్ట్ చేసే పద్యాలు "శంకరాభరణం" లో పండితులు వ్రాసినవి. వాటి మీద మీ విమర్శలు ఇక్కడ వేస్తే తగినంత గుర్తింపు, స్పందనా ఉండవు. ఆ కారణంగా "శంకరాభరణం" లో వెయ్యటం మంచిదని సవినయంగా చెప్పుకుంటున్నాను అంతే గానీ మిమ్మల్ని బాధపెట్టే ఉద్దేశం ఏమాత్రమూ లేదు. మీరు ఈ నా బ్లాగ్ లో పోస్టులు చూస్తున్నందుకు సంతోషముగా ఉంది. అందుకు కు నా ధన్యవాదములు.

  ReplyDelete