శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు
Showing posts with label
శంకరాభరణం పద్యం గుండా వేంకట సుబ్బ సహ దేవుడు
.
Show all posts
Showing posts with label
శంకరాభరణం పద్యం గుండా వేంకట సుబ్బ సహ దేవుడు
.
Show all posts
Saturday, August 2, 2014
22 - పద్యరచన - 639 (పల్లె పిల్ల)
కవిమిత్రులారా,
పై చిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
కంది శంకరయ్య
గారి
శంకరాభరణం
లో నాకు నచ్చిన పద్యాలు:
గుండా వేంకట సుబ్బ సహ దేవుడు
చెప్పారు...
చక్కని చీరను దీర్చెను
పిక్కల పైదాక, కొంగు బిగచుట్టగ పై
నిక్కిన సోయగ మదిరెన్
జిక్కదె మది గడ్డి మోపు చేతుల కెత్తన్?
ఆగస్టు 02, 2014 4:27 PM
Wednesday, July 2, 2014
017 - పద్యరచన - 607 (నాని)
కవిమిత్రులారా,
పైచిత్రంలో ఉన్న నా పౌత్రుని ఆశీర్వదిస్తూ పద్యము(లు) వ్రాయవలసిందిగా మనవి.
ఇంకా పేరు పెట్టలేదు కాని ‘శివసాయి’ అని పిలుస్తున్నాం. నేనేమో ‘నానీ’ అని పిలుస్తాను.
వాడికి దూరంగా వృద్ధాశ్రమంలో ఉన్నాననే నా బాధ.
మనుమఁడ! నిను వీడి యిచట
ఘనదుఃఖాత్ముఁడ నయి బ్రతుకఁగ వలసె నయో!
మనమున చెదరని నీ రూ
పును సతము స్మరించి ప్రొద్దు పుచ్చెద నానీ!
కంది శంకరయ్య గారి
శంకరాభరణం
లో నాకు నచ్చిన పద్యాలు:
గుండా వేంకట సుబ్బ సహ దేవుడు
చెప్పారు...
బూరెలఁ బోలిన బుగ్గలు,
మారాములఁ జేయు నవ్వు మరువగ లేనే!
రారా! ముద్దుల మనుమడ!
గారాముగఁ బ్రతి దినంబు కలలో నానీ!
జులై 01, 2014 9:48 PM
Older Posts
Home
Subscribe to:
Posts (Atom)