Thursday, April 28, 2016

69 - ఖండకావ్యము - 11 (ఋతు సందేశం)

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :

రచన : మిస్సన్న (దువ్వూరి వేంకట నరసింహ సుబ్బారావు)

కాల దివ్య చక్ర గంభీర గమనాన
చీకటైన వెనుక చిందు వెలుగు
కష్ట సుఖము లిట్లె గమియించు బ్రదుకున
ఎరుక సేయు "ఋతువు" లిట్టి నిజము.

Thursday, April 21, 2016

68 - ఖండకావ్యము – 6 (సరస్వతీ!)


కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


రచన : లక్ష్మీదేవి


మ.     కరమున్ బట్టుదు పుస్తకంబు, మనమున్ కైంకర్యమున్ జేతు, నీ
దరికిన్ బిల్వుము శారదా! చదువులన్ దానంబుగా నిచ్చెదో,
వరముల్ వేయు నవేల చాలు నదియే, వాణీ! సదాచారిణీ!
స్థిరమౌ దృష్టిని నన్ను గాచుకొనుమా శ్రీమంగళాకారిణీ!

Tuesday, April 19, 2016

67 - పద్యరచన - 1198 (అన్నయ్య)

కవిమిత్రులారా పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యాన్ని వ్రాయండి.

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


డా.బల్లూరి ఉమాదేవి.ఏప్రిల్ 18, 2016 5:28 [PM]
1.చిక్కు దీసి నీకు చక్కగ జడవేతు
అమ్మ వచ్చు దాక నన్ని నేనె
జోలపాట పాడి జోకొట్టుచును నిన్ను
కంటి రెప్ప వోలె కాతునమ్మ