కవిమిత్రులారా,
ఈరోజు పూరించవలసిన సమస్య ఇది...
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
(అన్నపరెడ్డి సత్యనారాయణ రెడ్డి గారికి ధన్యవాదాలతో...)
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :
గురువు గారికి, కవిమిత్రులకెల్లరులకు నమస్కారములు.
కట్టడి సేయక భార్యకు
పెట్టెల నిండార నగలు పీతాంబరముల్
పెట్టుచు సతి మాటకు జై
కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్ .
కట్టడి సేయక భార్యకు
పెట్టెల నిండార నగలు పీతాంబరముల్
పెట్టుచు సతి మాటకు జై
కొట్టెడు పతి సుజనుడనుచు గోమలి పలికెన్ .
పట్టిన కుందేలున కే
పట్టున లెక్కిడిన మూడె పాదము లనగన్
రెట్టించక వెంటనె "ఊ
కొట్టెడు" పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్
పట్టున లెక్కిడిన మూడె పాదము లనగన్
రెట్టించక వెంటనె "ఊ
కొట్టెడు" పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్
నా పూరణ....
పుట్టెడు పనిలో మునిగియు
పట్టినిఁ దా బుజ్జగించి పడుకొనఁబెట్టన్
గట్టిగఁ బాడుచు మరి జో
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
పుట్టెడు పనిలో మునిగియు
పట్టినిఁ దా బుజ్జగించి పడుకొనఁబెట్టన్
గట్టిగఁ బాడుచు మరి జో
కొట్టెడు పతి సుజనుఁ డనుచుఁ గోమలి పలికెన్.
సమస్యా పూరణ
ReplyDeleteమెట్టిన దినమును మొదలుగ
పట్టిన చేతిని విడువక బలిమియె తానై
పుట్టెడు దుఃఖములను పో
“గొట్టెడు పతి సుజనుడనుచు కోమలి బల్కెన్”
మీ పద్యం చాలా చాలా బాగుంది. జీవిత సత్యం ని చాలాబాగా చెప్పారు.
ReplyDelete