Monday, September 28, 2015

59 -- పద్య రచన - 1017 (వినాయక నిమజ్జనం)


కవిమిత్రులారా, పై చిత్రమును పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.

వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 9/27/2015 12:01:00 [AM]

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యాలు :


శ్రీపతిశాస్త్రి చెప్పారు...

శ్రీగురుభ్యోనమః

సజ్జన జాతిని బ్రోచుచు
ముజ్జగముల నేలుచుండు మూషికరథుడౌ
యొజ్జ గనేశుని గొలచుచు
మజ్జన మొనరించుచుండ్రి మమకారముతోన్
సెప్టెంబర్ 27, 2015 5:09 [PM]


ఊకదంపుడు చెప్పారు...

నిత్య పూజ లన్ని నియమానుసారము
సలుప లేక జనులు సాగనంపు
పర్వ మద్దె పెద్ద పండువగా మారెఁ
గాంచుడిద్దియె కలికాల మహిమ.

2 comments:

  1. అనేక ధన్యవాదములండీ.

    ReplyDelete
    Replies
    1. వైవిధ్యముగా చక్కని భావనతో పద్యాన్ని వ్రాసిన మిమ్మల్ని మెచ్చుకోవాలి.

      Delete