న్యస్తాక్షరి - 21
అంశం- బమ్మెర పోతన.
ఛందస్సు- ఉత్పలమాల.
మొదటిపాదం మొదటి అక్షరం ‘భా’
రెండవ పాదం ఆఱవ అక్షరం ‘భా’
మూడవ పాదం పదవ అక్షరం ‘భా’
నాల్గవ పాదం పదునాఱవ అక్షరం ‘భా’
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 12/29/2014 12:10:00 [AM]
కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యము :
భాగవతమ్ము వ్రాసె కవి బమ్మెర పోతన తేనెలూరగన్
సాగెడి భక్తి భావమున చక్కని చక్కెర చిందినట్టులన్
బాగుగ నుండెనో మనది భాగ్యము పుట్టెను తెన్గు గడ్డపై
నాగలి బట్టి పద్యములు నాటెడు వాడిట భారతీ కృపన్
No comments:
Post a Comment