Wednesday, November 12, 2014

36 -- పద్యరచన - 733 (సీతాఫలం)



కవిమిత్రులారా, పైచిత్రాన్ని పరిశీలించి తగిన పద్యము(ల)ను వ్రాయండి.
వీరిచే పోస్ట్ చెయ్యబడింది కంది శంకరయ్య వద్ద 11/12/2014 12:05:00 AM

కంది శంకరయ్య గారి శంకరాభరణం లో నాకు నచ్చిన పద్యం :

లక్ష్మీదేవి చెప్పారు...
రూపముఁ జూడగా జనులు రోసియు వీడరు కొన్ని పండ్లనే
లోపముఁ గానరాదనగ లుబ్ధతతో తిని సొక్కుచుందురీ
తీపి ఫలమ్ములన్; వనుల తీరుగ పండు మృగాళికెల్ల క్షు
త్తాప నివారణమ్మవగ ధాత్రి యొసంగు వరమ్ము భంగినిన్.
నవంబర్ 12, 2014 1:05 PM

4 comments:

  1. మంచి పద్యాన్ని ఎన్నుకున్నారు. ధన్యవాదాలు.

    ReplyDelete
  2. రావుగారు,
    నా పద్యానికి ఈ పురస్కారం లభించడం ముదావహం. ఈరోజే చూసినాను ఇంతకు మునుపు జగన్నాథునిపై వ్రాసిన పద్యమూ ఇక్కడ కనిపించడం నాకుసంతోషం కలిగింది.
    గురువుగారు, ధన్యవాదాలు.

    ReplyDelete
  3. కంది శంకరయ్య గారూ నమస్కారాలు వందనాలు. మీ శిష్యుల ఆణిముత్యాలే కదండీ ఇక్కడ కనిపించేది.

    ReplyDelete
  4. లక్ష్మీదేవి గారూ ఇల్లాగే చక్కటి పద్యాలు వ్రాస్తూ ఉండండి. మీ వ్యాఖ్యకు ధన్యావాదములు.

    ReplyDelete